ఒకే బైక్​పై నలుగురు ప్రయాణం...ఫలితం...

by Sridhar Babu |

పరిమితికి మించి ప్రయాణిస్తున్న బైక్​ కిందపడిపోయి యువతి మృతి చెందింది.

ఒకే బైక్​పై నలుగురు ప్రయాణం...ఫలితం...
X

దిశ, శామీర్ పేట : పరిమితికి మించి ప్రయాణిస్తున్న బైక్​ కిందపడిపోయి యువతి మృతి చెందింది. గేదెను బైక్​ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. జినోమి వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న నలుగురు ప్రయాణిస్తున్న బైక్ జినోమి వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ గడి మలక్ పేట్ ఫారెస్ట్ సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా రోడ్డుపైకి గేదె వచ్చింది.

దాంతో అదుపుతప్పి బైక్​ గేదెను ఢీ కొట్టింది. ఈ సంఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న సంధ్య (26) అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షేతగాత్రులను ఆర్విఎం హాస్పిటల్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story