- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటి బయట కూర్చున్న కుటుంబం.. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో నలుగురు మృతి
by Malleboina Mahesh |
సరదగా మాట్లాడుకోడానికి ఇంటి బయట కూర్చున్న ఓ కుటుంబంపై ఓ కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సరదగా మాట్లాడుకోడానికి ఇంటి బయట కూర్చున్న ఓ కుటుంబంపై ఓ కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులంతా కలిసి తమ ఇంటి ముందు కూర్చుని ఉన్నారు. అదే సమయంలో అటు నుంచి అదుపు తప్పి వేగంగా దూసుకొచ్చిన కారు.. వారిపై నుంచి వెళ్లింది. దీంతో ఎనిమిదేళ్ల బాలుడు సహా, నలుగురు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని కారుని నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






