- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. మృతుల్లో ఇద్దరు పిల్లలు
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంట్లో ప్రాణాలు కోల్పోయి కనిపించడం కలకలం గా మారింది. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లా రామంతలిలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంట్లో ప్రాణాలు కోల్పోయి కనిపించడం కలకలం గా మారింది. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లా రామంతలి (Ramantali)లో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ నివాసంలో విగతజీవులుగా పడి ఉండటం, మృతుల్లో 38 ఏళ్ల వ్యక్తి, అతని 60 ఏళ్ల తల్లితో పాటు ఐదేళ్లు, రెండేళ్ల వయసున్న ఇద్దరు చిన్న పిల్లలు ఉండటం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. సోమవారం రాత్రి సమయంలో వీరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, 38 ఏళ్ల వ్యక్తి, అతని తల్లి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపిస్తుండగా, ఇద్దరు పసిపిల్లల మృతదేహాలు నేలపై పడి ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఈ అఘాయిత్యానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.






