- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నలుగురి ప్రాణాలు తీసిన ఈత సరదా.. ఆ గ్రామంలో విషాదఛాయలు
అన్నమయ్య జిల్లా(Annamayya Dist) మదనపల్లి(Madanapalle)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్ద చెరువులో ఈతకు వెళ్లి నలుగురు మృతిచెందారు.

దిశ, వెబ్‌డెస్క్: అన్నమయ్య జిల్లా(Annamayya Dist) మదనపల్లి(Madanapalle)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్ద చెరువులో ఈతకు వెళ్లి నలుగురు మృతిచెందారు. ఈత నేర్పించే క్రమంలో ఇద్దరు పిల్లలు గల్లంతు అయ్యారు. వారిని కాపాడబోయిన తండ్రి కూడా మృతిచెందారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే తెలిసిన వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేసవి కావడంతో పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. ముఖ్యంగా ఊర్లో బావులు, చెరువులు ఉన్నటువంటి గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. స్నేహితులతో కలిసి ఈత రాకపోయినా.. వెళ్తుంటారు. కొట్టేందుకు చెరువులోకి దిగిన యువకుడు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందుతుంటారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఈత రాని పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు.






