మరో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-23 03:13:19  IST  )

మరో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

మరో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. ఆగివున్న లారీని అతివేగంగా దూసుకొచ్చిన ఓ తుఫాన్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం(Four People Dead) చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కోటబొమ్మాలి మండలం ఎత్తురాళ్లపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే స్పాట్‌కు వెళ్లిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఒడిశా నుంచి విశాఖ వస్తుండగా ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story