- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
హైదరాబాద్(Hyderabad)లోని హబ్సిగూడ(Habsiguda)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad)లోని హబ్సిగూడ(Habsiguda)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి.. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు(Police) హుటాహుటిన స్పాట్‌కు వెళ్లారు. మృతదేహాలను ఆసుపత్రి తరలించారు. కుటుంబం బలవన్మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితం బెంగళూరులో అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య చేసుకోగా, ఇటీవల తమిళనాడులోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆన్‌లైన్ రమ్మీ ఆట కారణంగా ఓ కుటుంబం బలైంది. అధికారులు, పోలీసులు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఇలాంటి ఘటనలు రోజుకో చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి.






