మరో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-14 16:09:57  IST  )

మధ్య ప్రదేశ్‌లో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది.

మరో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్య ప్రదేశ్‌లో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. బాలాఘాట్‌ జిల్లాలో మావోయిస్టుల(Maoists)కు, భద్రతా బలగాలకు మధ్య చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఎన్‌కౌంటర్‌ అనంతరం స్పాట్‌కు వెళ్లిన భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళా నేతలు ఉన్నట్లు గుర్తించారు. బిత్లి పోలీస్ అవుట్‌పోస్ట్ ప్రాంతంలోని పచామా దాదర్ దట్టమైన అడవిలో శనివారం ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్నది. ప్రస్తుతం ఇంకా సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నట్లు స్థానిక ఎస్సీ పేర్కొన్నారు. పోలీసులు, హాక్‌ ఫోర్స్‌ సంయుక్త బృందం ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించింది.

Next Story