- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. ఒకే ఇంట్లో విగతజీవులుగా నలుగురు కుటుంబసభ్యులు
కర్ణాటక(Karnataka)లోని మైసూరు(Mysore) విశ్వేశ్వరయ్య నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక(Karnataka)లోని మైసూరు(Mysore) విశ్వేశ్వరయ్య నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులు విగతజీవులుగా మారారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. చేతన్(45) అనే వ్యక్తి భార్య రూపాలి(43), తల్లి ప్రియందవ(62), కుమారుడు కుషాల్(15)కు విషమిచ్చి.. ఆ తర్వాత తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు.. విషయం తెలిసిన వెంటనే మైసూర్ పోలీస్ కమిషనర్ సీమా లట్కర్, డీసీపీ జాహ్నవి, విద్యారణ్యపురం ఇన్‌స్పెక్టర్ మోహిత్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.
Next Story






