దీపావళి వేళ తీవ్ర విషాదం.. ఇంట్లో బాణాసంచా పేలి నలుగురు మృతి

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-19 12:56:53  IST  )

దీపావళి(Diwali) పండుగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో బాణాసంచా పేలి(Firework Explosion) నలుగురు మృతిచెందారు.

దీపావళి వేళ తీవ్ర విషాదం.. ఇంట్లో బాణాసంచా పేలి నలుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి(Diwali) పండుగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో బాణాసంచా పేలి(Firework Explosion) నలుగురు మృతిచెందారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై నగరం సమీపంలోని పట్టాభిరామ్ ప్రాంతంలో సంభవించింది. దీపావళి పండుగ నేపథ్యంలో ఇంట్లో బాణాసంచా కొని నిల్వ పెట్టారు. ఆదివారం మధ్యాహ్నం అనూహ్యంగా మంటలు చెలరేగి క్రాకర్స్‌కు అంటుకున్నాయి. ఈ క్రమంలో ఒక్కొక్కటిగా అన్నీ పేలాయి. ఈ పేలుడు ధాటికి ఇళ్లు మొత్తం నేలమట్టం అయింది. ఇంట్లో ఉన్న నలుగురూ మృతిచెందారు. స్థానికులు అందరూ భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైరింజన్లతో వచ్చి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story