ఘోర రోడ్డు ప్రమాదం: కంటైనర్ ఢీకొని నలుగురు కానిస్టేబుళ్లు మృతి

by Malleboina Mahesh |

ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదం: కంటైనర్ ఢీకొని నలుగురు కానిస్టేబుళ్లు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న నలుగురు కానిస్టేబుళ్లు తమ వాహనంలో ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న భారీ కంటైనర్ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జు అయింది. నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసు సిబ్బందిని కోల్పోవడంపై ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

Next Story