- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాకింగ్ కు వెళ్లిన మాజీ సర్పంచ్ కిడ్నాప్
పండ్రేగుపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాము శిల్వరాజ్ ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

X
దిశ, ముదిగొండ : ముదిగొండ మండలంలోని పండ్రేగుపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాము శిల్వరాజ్ ను బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పండ్రేగుపల్లి గ్రామానికి చెందిన శిల్వరాజ్, జానీ మియా ప్రతిరోజూ తెల్లవారుజామున ఒకరికొకరు ఫోన్ చేసుకొని పండ్రేగుపల్లి, కానాపురం రోడ్డుపై వాకింగ్‌కు వెళ్తారు. బుధవారం జానీ మియా ఆలస్యంగా రావడంతో ముందుగానే వెళ్లిన శిల్వరాజ్ ను ఈద్గా సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి కిడ్నాప్ చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






