- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy:ఆటో డ్రైవర్ దాడి.. మాజీ ఎమ్మెల్యే మృతి
రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గోవా(Goa) మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత లావో మమ్లేదార్(68)(Former MLA Lavo Mamledar) అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రస్తుతం కర్ణాటక(Karnataka)లోని బెలగావిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఖడేబజార్‌లోని హోటల్ నుంచి ఆయన బయటకు వస్తుండగా.. కారు ఢీకొందని ఆటో డ్రైవర్ గొడవకు దిగాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ ఒకరినొకరు కొట్టుకునే వరకు దారి తీసింది. మొదటగా లావో మమ్లేదార్ డ్రైవర్ చెంప పై కొట్టారు.
దీంతో ఆవేశానికి గురైన ఆటో డ్రైవర్(Auto Driver) అతనిపై తిరిగి పలుమార్లు దాడి చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత మాజీ ఎమ్మెల్యే లాడ్జిలోకి వెళ్లగానే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మాజీ ఎమ్మెల్యే లావో మమ్లేదార్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు(Police) ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఓ పని నిమిత్తం కర్ణాటక బెళగావికి వెళ్లిన లావో మమ్లేదార్‌కు ఈ విధంగా మరణించడం సంచలనంగా మారింది. రాజకీయాల్లోకి రాకముందు మామ్లేదార్ గోవాలో డీఎస్‌పీ(DSP) ర్యాంక్ అధికారిగా పనిచేశారు.






