- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sahiti Infra Scam Case: 700 మంది నుంచి రూ.800 కోట్లు వసూలు.. మాజీ డైరెక్టర్ పూర్ణచందర్‌రావు అరెస్ట్
సాహితీ ఇన్‌ఫ్రా స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు దూకుడు పెంచారు.

దిశ, వెబ్‌డెస్క్: సాహితీ ఇన్‌ఫ్రా స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు దూకుడు పెంచారు. సాహితీ ఇన్‌ఫ్రా డైరెక్టర్ సందు పూర్ణచందర్‌రావు(Poorna Chandra Rao)ను మంగళవారం అరెస్ట్ చేశారు. ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో కస్టమర్లను మోసగించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 700 మంది కస్టమర్ల నుంచి రూ. 8,000 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. విల్లాలు, ప్లాట్ల పేరుతో భారీ మోసానికి తెరలేపినట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. సాహితీ పేరుతో వసూలు చేసిన రూ.120 కోట్లను పూర్ణచందర్ దారి మళ్లించినట్లు తెలిపారు. కాగా, సాహితీ ఇన్‌ఫ్రాపై ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే 200 కోట్ల ఆస్తులను సీసీఎస్ పోలీసుల అటాచ్ చేశారు. సుమారు 3వేల కోట్లకు పైగా వసూళ్లు చేసి సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ పరార్ అయినట్లు వార్తలు వచ్చాయి.






