భూమి పత్రాలు ఫోర్జరీ.. కలెక్టరేట్ ఎదుట బాధితుడి ఆత్మహత్యాయత్నం

by Kema Shiva Kumar |   (  Updated:2023-05-12 12:15:48  IST  )

తన పత్రాలు అధికారులు ఫోర్జరీ చేశారని ఆరాపిస్తూ ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామానికి చెందిన రామచందర్రావు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆత్మయత్నానికి పాల్పడ్డాడు.

భూమి పత్రాలు ఫోర్జరీ.. కలెక్టరేట్ ఎదుట బాధితుడి ఆత్మహత్యాయత్నం
X

దిశ, పెద్దపల్లి కలెక్టరేట్: తన పత్రాలు అధికారులు ఫోర్జరీ చేశారని ఆరాపిస్తూ ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామానికి చెందిన రామచందర్రావు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం తన ఫోర్జరీ పత్రాల గురించి అధికారులను కలిసేందుకు పెద్దపల్లికి రాగా ఎవరూ పట్టించుకోవడంలేదంటూ మనస్తాపానికి గురైన రామచంద్ర రావు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడటంతో ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. వైద్యులు ఆయన పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. అన్నదమ్ముల మధ్య భూ వివాదం ఉందని.. తన భూ పత్రాలను అధికారులే ఫోర్జరీ చేశారని రామచందర్రావు ఆరోపించాడు.

ఇవి కూడా చదవండి: మవోయిస్ట్ పార్టీ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ నేరేళ్ల జ్యోతి లొంగుబాటు

Next Story