మాజీ ప్రియుడితో కలిసి లివ్‌ఇన్ పార్ట్నర్‌ను చంపిన ఫోరెన్సిక్ స్టూడెంట్.. నెయ్యి, వైన్ పోసి దారుణం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-27 09:25:25  IST  )

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ తొలివారంలో గాంధీవిహార్ లో ఓ అపార్ట్ మెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ లో యూపీఎస్సీ అభ్యర్థి మృతదేహం కాలిన స్థితిలో లభ్యమైంది.

మాజీ ప్రియుడితో కలిసి లివ్‌ఇన్ పార్ట్నర్‌ను చంపిన ఫోరెన్సిక్ స్టూడెంట్.. నెయ్యి, వైన్ పోసి దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ తొలివారంలో గాంధీవిహార్ లో ఓ అపార్ట్ మెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ లో యూపీఎస్సీ అభ్యర్థి మృతదేహం కాలిన స్థితిలో లభ్యమైంది. తాజాగా అతను ప్రమాదంలో చనిపోలేదని, అతని సహజీవన భాగస్వామి అయిన ఫోరెన్సిక్ సైన్స్ స్టూడెంట్ అమృత చౌహాన్ తన మాజీ ప్రియుడితో కలిసి చంపేసిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. తొలుత ఈ కేసు అగ్నిప్రమాదంగా కనిపించినా..పగ, ప్రతీకారాలతో మర్డర్ ను అగ్నిప్రమాదంగా చిత్రీకరించినట్లు వెల్లడైంది.

మృతుడు రామ్ కేష్ మీనాతో 21 ఏళ్ల అమృత చౌహాన్ మే నెల నుంచి లివిన్ రిలేషన్ షిప్ లో ఉంది. ఆమెకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేయడంతో అమృత ఆగ్రహానికి గురైంది. వీడియోలు డిలీట్ చేయాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో అతడిని అంతమొందించాలని మాజీ ప్రియుడు, ఎల్పీజీ డెలివరీ బాయ్ అయిన సుమిత్ కశ్యప్, అతని ఫ్రెండ్ సందీప్ కుమార్ కలిసి ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ కు చెందినవారుగా గుర్తించారు. హత్యకు ప్రణాళిక వేసి, ఆపై తప్పించుకునేందుకు అమృత, సుమిత్ ఫోరెన్సిక్ సైన్స్, గ్యాస్ మెకానిక్స్ లో తమకు ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించారని తెలిపారు. రామ్ ను హతమార్చిన తర్వాత అతని డెడ్ బాడీపై నెయ్యి, వైన్ పోసి నిప్పంటించారు. ఆపై సిలిండర్ బ్లాస్ట్ చేసి ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు నమ్మించినా.. ఫోరెన్సిక్ విచారణలో అది ఫైర్ యాక్సిడెంట్ కాదని తేలింది.

ఈ ముగ్గురూ అక్టోబర్ 5–6 రాత్రి మొరాదాబాద్ నుండి ఢిల్లీకి ప్రయాణించి గాంధీ విహార్‌లోని నాల్గవ అంతస్తులో ఉన్న మీనా ఫ్లాట్‌లోకి ప్రవేశించారు. కొన్ని క్షణాల తర్వాత అపార్టుమెంటులో పేలుడు జరిగింది. ఆ రోజు రాత్రి ఇద్దరు వ్యక్తులు ముసుగు వేసుకుని భవనంలోకి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందని నార్త్ జోన్ డీసీపీ రాజా బందియా తెలిపారు. వారు బయటకు వెళ్లగానే మంటలు రావడం అనుమానాన్ని రేకెత్తించిందని, ఫోరెన్సిక్ ఫలితాల ఆధారంగా, ఇది హత్య అని స్పష్టమైందన్నారు. అనేక విచారణల తర్వాత అక్టోబర్ 18న అమృతను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా.. నేరాన్ని అంగీకరించిందన్నారు. తాను, సుమిత్, సందీప్.. రామ్ గొంతుకోసి, హతమార్చి అతని డెడ్ బాడీని కాల్చినట్లు చెప్పిందన్నారు. అక్టోబర్ 21న సుమిత్ ను, 23న సందీప్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముగ్గురూ నేరాన్ని అంగీకరించడంతో హత్య, కుట్ర, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Next Story