- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నారులకు బలవంతంగా టాటూలు.. అనంతరం చర్మాన్ని కత్తిరించడంతో..
కన్నతల్లి, సవతి తండ్రి వారి పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తించారు.

దిశ, వెబ్‌డెస్క్: కన్నతల్లి, సవతి తండ్రి వారి పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఇద్దరు పిల్లలకు బలవంతంగా టాటూలు వేయించారు. వాటిని చెరిపేసేందుకు ఏకంగా చిన్నారుల చర్మాన్ని కత్తిరించారు. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. టెక్సాస్ కు చెందిన గన్నర్ ఫార్ అనే మహిళకు 5, 9 ఏళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు. అయితే సదరు మహిళ భర్తకు డైవర్స్ ఇచ్చి మేగాన్ మే ఫార్ ను వివాహం చేసుకుంది.
అయితే చిన్నారులకు వీరిద్దరు టాటూలు వేయించాలని డిసైడ్ అయ్యారు. పిల్లలు అరవడంతో వారిని తాడుతో కట్టేశారు. నోట్లో దుస్తులు కుక్కి, కళ్లకు గంతలు కట్టారు. అయితే పిల్లలను చూడటానికి మహిళ మొదటి భర్త రాగా ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులకు తెలిస్తే ఇబ్బంది అవుతుందని.. టాటూను తొలగించడానికి చర్మాన్ని తొలగించారు. పిల్లలకు లోతైన గాయాలు ఉండటంతో మొదటి భర్త పోలీసులను ఆశ్రయించాడు. వారు నిందితులిద్దరి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






