భర్త సంసారానికి తీసుకెళ్లడం లేదని బలవన్మరణం

by Sridhar Babu |

కుటుంబ కలహాలతో ఓ వివాహిత చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని జప్తిసింగాయపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.

భర్త సంసారానికి తీసుకెళ్లడం లేదని బలవన్మరణం
X

దిశ,ములుగు : కుటుంబ కలహాలతో ఓ వివాహిత చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని జప్తిసింగాయపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కుకునూర్ రమేష్, శ్యామల దంపతుల కూతురు మమత(22)కు మేడ్చల్ మండలం రామన్కోల్ గ్రామానికి చెందిన తరిగొప్పుల నర్సింహులుతో గత నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.

మమత సంసారంలో విబేధాలు రావడంతో ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలోని తన పుట్టినింటికి వచ్చి గత కొద్ది రోజులుగా ఉంటుంది. కాగా భర్త తనను సంసారానికి తీసుకుపోవడంలేదని మనస్థాపానికి గురై శుక్రవారం జప్తిసింగాయపల్లి సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story