పార్కు నుంచి ఎత్తుకెళ్లి యువతిపై గ్యాంగ్ రేప్

by Javid Pasha |
పార్కు నుంచి ఎత్తుకెళ్లి యువతిపై గ్యాంగ్ రేప్
X

దిశ, వెబ్ డెస్క్: పార్కులో ఉన్న ఓ యువతిని ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఓ పార్కులో ఫ్రెండ్ ను కలవడానికి వచ్చిన ఓ యువతి గుర్తు తెలియన నలుగురు వ్యక్తులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. అనంతరం ఆ యువతిని కారులో వేసి.. నగరం మొత్తం తిప్పుతూ కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బెంగళూరు సీనియర్ పోలీసు ఆఫీసర్ సీకే బాబా తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతి తన ఫ్రెండ్ ను కలవాడాని ఈ నెల 25 సాయంత్రం పూట కోరమంగల్ లోని నేషనల్ గేమ్స్ విలేజ్ పార్కుకు వచ్చింది. అయితే కొద్దీ సేపటికే ఆమె ఫ్రెండ్ కూడా వచ్చాడు. ఇద్దరి కలిసి కొంత సేపు మాట్లాడుకున్నాక అతడు వెళ్లిపోయాడు.

అయితే ఇదే అదనుగా చూస్తున్న నలుగురు దుండుగులు ఆమెను అపహరించి కారులోకి ఎక్కించారు. అనంతరం అదే కారులో రాత్రంతా తిరుగుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున యువతిని ఇంటి వద్ద వదిలిపెట్టి పారిపోయారు. అయితే పోలీసులకు చెబితే చంపేస్తామంటూ దుండగులు బెదిరించడంతో మౌనంగా ఉన్న యువతి.. తల్లిదండ్రుల సాయంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed