- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజమండ్రి కల్తీపాల ఘటనలో ఐదేళ్ల బాలుడు మృతి
రాజమండ్రి కల్తీ పాల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కల్తీ పాల ఘటనలో ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు.

దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి కల్తీ పాల ఘటన(Rajahmundry Adulterated Milk Incident) రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కల్తీ పాల ఘటనలో ఐదేళ్ల బాలుడు మృతి(Boy Dead)చెందాడు. విశాఖలోని ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు మంగళవారం కన్నుమూశాడు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేసింది. అంతకుముందే.. ఈ ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీర పాండ్యన్ స్పందించారు. కల్తీ పాలు ఘటనలో నలుగురు మృతి చెందారని, 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. నలుగురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పుకొచ్చారు. వీర పాండ్యన్ ఇవాళ(సోమవారం) రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. పాల వ్యాపారి 126 కుటుంబాలకు పాలు పోశారని, పాలు కల్తీ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని అన్నారు. పాలు, పెరుగు, బాధితుల రక్త నమూనాలు సేకరించి లేబరేటరీలకు పంపించినట్లు వివరించారు. ఇప్పటికే పాల వ్యాపారిని సైతం అరెస్ట్ చేశామని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.






