- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర విషాదం నింపిన ఉత్సవాలు.. ఐదుగురు మహిళలు స్పాట్ డెడ్
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నామక్కల్ పరమతి వేలూరు సమీపంలో కంటైనర్‌ను ఓ కారు ఢీకొట్టింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నామక్కల్ పరమతి వేలూరు సమీపంలో ఓ కారు కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, వీరంతా ఉత్సవాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాలు సేకరించడంతో పాటు, ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






