బొలెరో ఢీ.. ఐదు గొర్రెలు, రెండు మేక‌పోతులు మృతి

by Ratna Kumari |

నాగర్ కర్నూల్ జిల్లాలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న గొర్రెలను అతి వేగంగా బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఐదు గొర్రెలు ,రెండు మేక పోతులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు విడిచాయి.

బొలెరో ఢీ.. ఐదు గొర్రెలు, రెండు మేక‌పోతులు మృతి
X

దిశ, పెద్దకొత్తపల్లి : నాగర్ కర్నూల్ జిల్లాలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న గొర్రెలను అతి వేగంగా బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఐదు గొర్రెలు ,రెండు మేక పోతులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు విడిచాయి. ఈ సంఘటన నాగర్ కర్నూల్ - కొల్లాపూర్ మధ్య 167 కే జాతీయ రహదారిపై పెద్దకొత్తపల్లి మండలం వాయిల బావి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వాయిలబావి గ్రామానికి చెందిన గోరంట్ల నర్సింహ తన గొర్రెల మందను మేత కోసం రోజు వారిగా పంట పొలాలకు తీసుకెళ్లాడు. సాయంత్రం గొర్రెల మందను తన సొంత ఇంటికి వాయిల బావి గ్రామానికి తీసుకొని వస్తూ జాతీయ రహదారిని దాటుతుండగా .. వనపర్తి జిల్లా ఎదుల మండల కేంద్రానికి చెందిన ఆంజనేయులు TS09 UD 6730 నెంబర్ గల బొలెరో వాహనం మామిడి కాయల లోడ్ తో పెద్ద కొత్తపల్లి వైపు నుంచి హైదరాబాద్ కు అతి వేగంగా వెళ్తోంది. ఈ క్ర‌మంలోనే గొర్రెల మంద‌ ను డీ కొట్టింది. దీంతో 5 గొర్రెలు, 2 మేక పోతులు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి. వీటి విలువ దాదాపు రూ.1ల‌క్ష‌ 30 వేలు ఉంటుందని ఆ గ్రామస్థులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనం పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Next Story