హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య!

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-21 04:31:40  IST  )

గ్రేటర్ హైదరాబాద్‌(Hyderabad)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య!
X

దిశ, వెబ్‌డెస్క్/శేరిలింగంపల్లి: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. మియాపూర్ మక్తాలో ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ముందుగా రెండేళ్ల చిన్నారిని చంపేసి అనంతరం నలుగురు విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం పక్కింటి వారు మృతదేహాలను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. మృతులంతా కర్ణాటక రాష్ట్రం వారని, బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చి గత ఆరేళుగా ఇక్కడే ఉంటున్నారని, వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా స్థానికులు చెబుతున్నారు. మృతుల్లో లక్ష్మయ్య(60), వెంకటమ్మ(55), అల్లుడు అనిల్(40), కవిత(38), అనిల్, కవితల కుమార్తె అప్పు(2)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story