ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు మ‌ృతి

by Malleboina Mahesh |

ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొట్టడంతో.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదమైన ఘోర సంఘటన ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు మ‌ృతి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొట్టడంతో.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదమైన ఘోర సంఘటన ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. కె బాలంగ్ ప్రాంతంలో జాతీయ రహదారి-520 పై వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ భయంకర ఘటనలో కనీసం ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే కె బాలంగ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి చకిత్స అందిస్తున్నారు. బస్సు బాగా దెబ్బతినడంతో అందులో ఇంకా పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, వాహనంలో చిక్కుకున్న వారిని కట్టర్ల సహాయంతో బయటకు తీయడానికి సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story