విషాదం.. ఇంటి పైకప్పు కూలి ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి

by Malleboina Mahesh |

ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ షాకింగ్ ఘటన బీహార్ రాష్ట్రం సరన్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.

విషాదం.. ఇంటి పైకప్పు కూలి ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం (Five people died) పాలయ్యారు. ఈ షాకింగ్ ఘటన బీహార్ రాష్ట్రం సరన్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అకిల్‌పూర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని మానస్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రాత్రి సుమారు 9.45 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా జరిగింది. ఈ ఘటన సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు.

కానీ అప్పటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనతో మానస్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సరన్ జిల్లా ఎస్‌ఎస్‌పీ కుమార్ ఆశిష్ ఘటనపై స్పందిస్తూ, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. పాత ఇల్లు కావడంతో వర్షాల కారణంగా గోడలు, పైకప్పు బలహీనమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

Next Story