స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి, శిథిలాల కింద మరో ఐదుగురు

by Gantepaka Srikanth |

స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు.

స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి, శిథిలాల కింద మరో ఐదుగురు
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) రాష్ట్రం రాయ్‌పూర్‌(Raipur)లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. రాయ్‌పూర్‌లోని స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఐదుగురు దుర్మరణం(Five Dead) చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. శిథిలాల కింద మరో ఐదుగురు కార్మికులు ఉన్నట్లు కార్మికులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story