- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దానివల్లనే ప్రమాదం జరిగింది.. గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఫైర్ సేఫ్టీ నివేదిక
గుల్జార్ హౌస్ ఘటనలో భాదితులకు సంబంధించిన దుకాణంలో ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డు వద్ద ఏర్పడిన ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిందని ఫైర్ డిజీ నాగిరెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గుల్జార్ హౌస్ ఘటనలో భాదితులకు సంబంధించిన దుకాణంలో ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డు వద్ద ఏర్పడిన ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిందని ఫైర్ డిజీ నాగిరెడ్డి తెలిపారు. ప్రమాద ఘటనలో పొగతో ఊపిరి అడక 17 మంది ఓకే రూమ్ లో మరణించారని తెలిపారు. డీజీ కార్యాలయంలో మీడియా సమావేశంలో బుధవారం డీజీ నాగిరెడ్డి మాట్లాడారు. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదానికి సంబంధించి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బిల్డింగ్ ప్లాన్ తో వివరించారు. అగ్ని ప్రమాద ఘటనలో మొదటగా కింద ఫ్లోర్లో ఉన్న దుకాణం కాలి పోయినట్లు వెల్లడించారు. దుకాణం మొత్తం చెక్కతో చేయబడి ఉందని, సోఫా లాంటీ వస్తువులు కూడా ఉంటడంతో మంటలు బాగా వ్యాపించాయని తెలిపారు.
ప్రమాదం సమయం ఉదయం 4.30 సుంచి 5 గంటల ప్రాంతంలో జరిగినట్లు విచారణలో వెల్లడైనట్లు. సుమారు గంట పాటు ప్రమాదంలో చనిపోయిన వారే మంటలను ఆర్పేందుకు ప్రయాత్నించారని తెలిపారు. మంటలు అదుపులోకి రాక పోవడంతో వారంత పై ఫ్లోర్ కు వెళ్లి ఒకే రూంలో మొత్తం లాక్ చేసుకుని ఉండి పోయారని తెలిపారు. మంటలు బాగా వ్యాప్తి చెంది ఏసీ కంప్రెసర్ కూడా పెలిపోయిందని తెలిపారు. పై ఫోర్ లోకి పోగ వ్యాప్తి చెందడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించిదని తెలిపారు. ముందే జగ్రత వహించి ఫైర్ డిపార్ట్మెంట్ కు కాల్ చేసి ఉంటే ఒక్క ప్రాణం కూడా పోయి ఉండేదని కాదని తెలిపారు. ఘటన పై ఫైర్ డిపార్ట్మెంట్ పై వస్తున్న వార్తలలో నిజం లేదని తెలిపారు. ఫైర్ ఇంజిన్లు సకాలంలో స్పందించి సహయక చర్యలు చెపట్టాయిని తెలిపారు.
ఫైర్ డిపార్ట్మెంట్ కు ఉదయం గం.6.16 సమయంలో అగ్ని ప్రమాద ఘటనకు సబంధించిన కాల్ వచ్చిందని ఉ.6.24 కల్లా ఫైర్ సిబ్బంది ఘటన ప్రాంతానికి చెరుకున్నారని తెలిపారు. ఫైర్ ఇంజన్ లలో మంటలు ఆర్పే సమయంలో నీళ్లు అయిపోయాయన్న ఆరోపణలలో కూడా వాస్తవం లేదన్నారు. బిల్డింగ్ అంతా మంటలు వ్యాపించడంతో పైకి వెళ్లే మార్గం లేకపోవడంతో పక్కనే ఉన్న బిల్డింగు గోడ పగలగొట్టి ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లారని తెలిపారు. సిబ్బంది లోపలికి వెళ్లి చూసేసరికి ఒక రూములో 17 మంది సృహ తప్పి పడి ఉన్నారని తెలిపారు. అందరూ గాఢమైన పొగ పీల్చడంతో అపస్మారక స్థితిలో ఉన్నారని వారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఘటనలో అందరూ చనిపోవడం బాధాకరమని అన్నారు. ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.






