- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎలాక్ట్రిక్ కారులో మంటలు.. పూర్తిగా దగ్ధం
by Taduka Kalyani |
బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫారం రోడ్డులో గురువారం కారులో మంటలు చెలరేగాయి.

X
దిశ, కంటోన్మెంట్/ బోయిన్ పల్లి: బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫారం రోడ్డులో గురువారం కారులో మంటలు చెలరేగాయి. ఇన్ స్పెక్టర్ కందుల రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాజిగూడకు చెందిన జోనాథన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి విధులు ముగించుకొని తన నెక్స కారులో ఇంటికి వెళ్తున్నాడు. డైరీ ఫారం రోడ్డు నుంచి వెళ్తుండగా కారులో శబ్దం వచ్చింది. పక్కకు తీసుకునే క్రమంలో కారు బైకును ఢీకొట్టింది.
దీంతో బైక్ పై వెళ్తున్న జగద్గిరిగుట్ట కు చెందిన బాల నర్సింహ కాలుకు గాయాలయ్యాయి. కారు పక్కకు తీసుకున్న జోనాథన్ దిగి చూసే సరికి ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. అప్పటికే కారు లో నుంచి బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. కారు కాలి బూడిదైంది. దీంతో బోయిన్ పల్లి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
Next Story






