- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం
by Kema Shiva Kumar |
రైస్ మిల్లులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన నంగునూర్ మండలం రాంపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : రైస్ మిల్లులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన నంగునూర్ మండలం రాంపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని విజయలక్ష్మి ఇండస్ట్రీలో గన్నీ బ్యాగులకు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది రైస్ మిల్లుకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంలో సుమారు ఆరు వందల గన్నీ బ్యాగులు బూడిదయ్యాయి. ఈ మేరకు రాజగోపాల్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






