ప్రైవేటు బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

by Kema Shiva Kumar |

ఓ ప్రైవేటు బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన నగరంలోని SR నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

ప్రైవేటు బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ ప్రైవేటు బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన నగరంలోని SR నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు సుమారు 40 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరింది. ఈ క్రమంలోనే బస్సు మియాపూర్ మెట్రో స్టేషన్ వద్దకు రాగానే ఏదో కాలిన వాసన వస్తుందని ప్రయాణికులు డ్రైవర్ దృష్టి తీసుకొచ్చారు. అనంతరం బస్సును ఆపి చెక్ చేసి మళ్లీ ముందుకు కదులుతుండగా.. ముందు భాగంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు, సిబ్బంది హుటాహుటిన బస్సు దిగిపోవడం పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి షాక్ సర్క్యూట్ కారణం అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Next Story