ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-25 05:08:01  IST  )

నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం (Huge Fire Accident) చోటుచేసుకుంది.

ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: నగరం మరో భారీ అగ్ని ప్రమాదం (Huge Fire Accident) చోటుచేసుకుంది. మూసాపేట్‌ (Moosapet) పరిధిలోని గుడ్స్‌ షెడ్ రోడ్డు పరిధిలోని ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపో (Indian Containers Corporation Depot)లో ఉన్నట్టుండి మంటలు ఎగసిపడ్డాయి. అయితే, ఆ మంటలు మెల్లగా గోదాంలో నిల్వ ఉంచిన రసాయన విభాగానికి అంటుకోగా.. భారీ పేలుడు సంభవించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందజేయగా.. వారు హుటాహుటన స్పాట్‌కు ఫైరింజన్లపై చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంతో మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్డు ప్రాంతం అంతా దట్టమైన నల్లని పొగలు అలముకున్నాయి. ఈ హఠాత్పరిణామంతో స్థానికులు తమకు ఊపిరాడటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉంటుందని ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపో అధికారులు వెల్లడించారు.

Next Story