- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసముద్రం రైల్వేస్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. నలుగురు ఉద్యోగులు సేఫ్
by Kema Shiva Kumar |
కేసముద్రం రైల్వేస్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటచేసుకుంది.

X
దిశ, కేసముద్రం: కేసముద్రం రైల్వేస్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటచేసుకుంది. స్టేషన్‌లోని నిలిపివేసిన ఓ రెస్ట్ కోచ్ అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కోచ్‌లో నలుగురు ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. వారు చాకచక్యంగా స్పందించి వెంటనే కంపార్ట్‌మెంట్ తలుపులు తెరిచి ప్రాణాలతో బయటపడ్డారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రైల్వే స్టెషన్‌కు చేరుకుని రెస్ట్ కోచ్‌లో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం జరగలేదు. రైల్వే అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ప్రమాద సమయంలో దట్టమైన పొగలు వెలువడటంతో ఆ పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది.
Next Story






