- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: పండుగపూట నగరంలో ఘోర అగ్ని ప్రమాదం
by Gantepaka Srikanth |
వినాయక చవితి వేళ హైదరాబాద్(Hyderabad)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితి వేళ హైదరాబాద్(Hyderabad)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. అమీర్‌పేట్(Ameerpet)లోని బాలాజీ నెయ్యి తయారీ దుకాణంలో బుధవారం రాత్రి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో పొగ దట్టంగా కమ్ముకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దుకాణంలో ఎంతమంది ఉన్నారనే సమాచారం తెలియరాలేదు. భారీగా మంటలు ఎగసిపడడంతో పక్కనే ఉన్న ఎంబ్రాయిడరీ షాపులోకి మంటలు వ్యాపించి అందులోని వస్తువులు కాలిపోయాయి. మెట్రో పిల్లర్ 1444 వద్ద ఉన్న బాలాజీ స్టోర్‌లో ఈ ప్రమాదం సంభవించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






