సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం.. టెక్స్‌టైల్‌ మార్కెట్ భవనంలో పెద్దఎత్తున మంటలు

by Ajay Maddhiboyina |

సూర‌త్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప‌ర్వ‌త్ పాటియా ప్రాంతంలోని బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నం రాజ్ టెక్స్ టైల్ మార్కెట్ భవనంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.

సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం.. టెక్స్‌టైల్‌ మార్కెట్ భవనంలో పెద్దఎత్తున మంటలు
X

దిశ‌, వెబ్ డెస్క్: సూర‌త్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప‌ర్వ‌త్ పాటియా ప్రాంతంలోని బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నం రాజ్ టెక్స్ టైల్ మార్కెట్ భవనంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పై రెండు అంతస్తుల్లో దట్టంగా పొగ అలుముకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు గంట‌ల పాటు శ్ర‌మించి మంటలను అదుపుచేశారు. దాదాపు 20 నుండి 22 అగ్నిమాప‌క ద‌ళాలు మోహ‌రించి ప‌రిస్థితిని అదుపులోకి తీసుకువ‌చ్చాయి.

ప్రమాదంతో ప్రజలు ఒక్కసారిగా భవనం నుండి బయటకు వచ్చి పరుగులు తీస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లోని లిఫ్ట్ వైరింగ్ నుండి మంట‌లు ప్రారంభం అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో 20కి పైగా దుకాణాలు ప్ర‌భావితం అయిన‌ట్టు స‌మాచారం. సింథ‌టిక్ క్లాత్ స్టాక్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల భారీ న‌ష్టం జ‌రిగిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌మాద‌స్థ‌లంలో ఇప్ప‌టికీ స‌హాయ చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. సింథ‌టిక్ వ‌స్త్రాలు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల అగ్నిమాప‌క సిబ్బంది ఆప‌రేష‌న్ స‌మ‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం మేర‌కు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు.

Next Story