- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు రోజుల్లో షాపు ఓపెనింగ్.. అంతలో భారీ అగ్ని ప్రమాదం
by Ajay Maddhiboyina |
మరో రెండు రోజుల్లో షాపు ఓపెనింగ్ ఉండగా అగ్నిప్రమాదం జరగటంతో భారీ ఆస్తినష్టం జరిగింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్ భగాయత్ లోని లిమ్రా పరుపుల దుకాణంలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: మరో రెండు రోజుల్లో షాపు ఓపెనింగ్ ఉండగా అగ్నిప్రమాదం జరగటంతో భారీ ఆస్తినష్టం జరిగింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్ భగాయత్ లోని లిమ్రా పరుపుల దుకాణంలో చోటు చేసుకుంది. షాపు నిర్మాణంలో ఉండగా వాటర్ ట్యాంక్‌కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో స్పాంజిపై ఎలక్ట్రిక్ వైరు పడింది. దీంతో మంటలు అంటుకోగా షాపు మొత్తం స్పాంజి పరుపులు ఉండటంతో క్షణాల్లో వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు అదుపు చేసే సమయం కూడా లేకపోవడంతో షాపు పూర్తిగా దగ్దం అయ్యింది. షాపులో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలిపోవడంతో పాటు ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో రూ.25 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల్లో షాపు ప్రారంభించాల్సి ఉండగా కాలిపోవడంతో యజమాని ఖాదీర్ అవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Next Story






