- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సదర్‌బజార్‌లోని షాపింగ్ కాంప్లెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సదర్‌బజార్‌లోని షాపింగ్ కాంప్లెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.మొదటి అంతస్థులోని షాపుల్లో భారీగా మంటలు వ్యాప్తి చెందగా వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 15 ఫైర్ ఇంజిన్‌లతో మంటలు ఆర్పుతున్నారు.
కాంప్లెక్స్‌లో మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకుంది. సదర్ బజార్ ఫెడరేషన్ చైర్మన్ పరమ్ జీత్ సింగ్ మాట్లాడుతూ.. మంటలు పగటిపూట చెలరరేగాయన్నారు. కాబట్టి సకాలంలో నియంత్రించగలిగినట్టు తెలిపారు. రాత్రిపూట జరిగి ఉంటే సదర్ బజార్‌కు భారీగా నష్టం జరిగి ఉండేదన్నారు. ఇప్పటి వరకు ఎవరూ కాంప్లెక్స్‌లో చిక్కుకోలేదని చెప్పారు. కానీ ఫైర్ సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయని తెలిపారు. ఘటనపై విచారణ జరిగితే ఖచ్చితమైన కారణం తెలుస్తుందని చెప్పారు.






