Fire Accident: షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.3 కోట్ల ఆస్తి నష్టం

by Kema Shiva Kumar |

షాపింగ్ మాల్‌ (Shopping Mall)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

Fire Accident: షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.3 కోట్ల ఆస్తి నష్టం
X

దిశ, వెబ్‌డెస్క్: షాపింగ్ మాల్‌ (Shopping Mall)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పలాస పట్టణం (Palaasa Town)లోని జాస్మిన్ బట్టల షాపులో షాట్ సర్క్యూట్ (Shot Circuit) మొదట మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమమంలో మాల్‌లో ఎవరూ లేకపోవడంతో ఆ మంటలు షాప్‌ మొత్తం వేగంగా వ్యాపించాయి. ఈ క్రమంలోనే మాల్‌ నుంచి దట్టమైన పొగలు బయటకు రావడంతో గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. షాపింగ్ మాల్ షెటర్స్ పూర్తిగా రిమోట్ కంట్రోల్‌ (Remote Control)తో ఆపరేట్ చేసేవి కావడంతో వాటిని తెరిచేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మరోవైపు చెలరేగుతోన్న మంటలు అదుపు తీసుకొచ్చేందుకు కూడా శ్రమిస్తున్నారు. మాల్ యాజమాన్యం తెలిపిన ప్రకారం.. ఇప్పటి వరకు మొత్తం రూ.3 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

Next Story