Fire Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.లక్షల్లో ఆస్తి నష్టం!

by Kema Shiva Kumar |   (  Updated:2024-11-22 13:08:56  IST  )

గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన యాద్రాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhongiri District) బీబీనగర్‌ (Bibinagar)లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.

Fire Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.లక్షల్లో ఆస్తి నష్టం!
X

దిశ, వెబ్‌డెస్క్: గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన యాద్రాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhongiri District) బీబీనగర్‌ (Bibinagar)లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీబీనగర్ (Biningar) శివారులోని హిందుస్థాన్ శానిటరీ గోడౌన్‌ (Hindustan Sanitary Godown)‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోడౌన్ సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో రైతులు గడ్డి తగులబెట్టారు. ఈ క్రమంలోనే నిప్పు రవ్వలు ఎగిరి గోడౌన్‌లోని కాటన్ బాక్స్‌లపై పడ్డాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ధట్టంగా పొగ అలుముకుంది. గోడౌన్ సిబ్బంది సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Next Story