- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fire Accident: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 200 వాహనాలు దగ్ధం
by Kema Shiva Kumar |
భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, వారణాసి (Varanasi)లోని అలైపూర్ రైల్వే స్టేషన్ (Alaipur Railway Station) పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, వారణాసి (Varanasi) రైల్వే స్టేషన్ పరిధిలోని అలైపూర్ రైల్వే గోడౌన్ (Alaipur Railway Godown) వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అలైపూర్ రైల్వే గోడౌన్ సమీపంలో ఉన్న పార్కింగ్ ఏరియా (Parking Area)లో ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అయితే, అక్కడ పార్క్ చేసిన వాహనాల్లో పెట్రోల్ ఉండటంతో పెలుడు కారణంగా మంటలు క్షణాల్లో పార్కింగ్ ఏరియా మొత్తం వ్యాప్తించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 200లకు పైగా వాహనాలు కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మొత్తం 12 ఫైరింజన్ల (Fire Engines)తో మంటలను అదుపు చేస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Next Story






