Fire Accident: జూబ్లీహిల్స్‌లోని పబ్‌లో అగ్నిప్రమాదం.. అదృష్టం కొద్దీ తప్పిన ప్రాణనష్టం

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-17 03:27:10  IST  )

జూబ్లీహిల్స్‌లోని ‘బై ద బాటిల్’ పబ్ కిచెన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కట్టెల పొయ్యి నిప్పరవ్వలు థర్మకోల్‌కు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి.

Fire Accident: జూబ్లీహిల్స్‌లోని పబ్‌లో అగ్నిప్రమాదం.. అదృష్టం కొద్దీ తప్పిన ప్రాణనష్టం
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రోడ్ నంబర్ 36లోని ‘బై ద బాటిల్’ (By The Bottle) పబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పబ్ కిచెన్‌లోని కట్టెల పొయ్యి నుంచి ఎగసిపడిన నిప్పరవ్వలే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కిచెన్ పైభాగంలో ఉన్న థర్మకోల్ షీట్లకు ఈ నిప్పరవ్వలు అంటుకోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో పబ్ అంతటా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో పబ్‌లో తక్కువ మంది ఉండటంతో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. పోలీసులు ఈ ప్రమాదంపై ప్రాథమిక విచారణ చేపడుతున్నారు.

Next Story