- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fire Accident: రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం.. ఏకంగా కాలి బూడిదైన 20 ఇళ్లు
రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకున్న ఘటన ఏలూరు (Eluru) జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకున్న ఘటన ఏలూరు (Eluru) జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండవల్లి (Mandavalli) మండల పరిధిలోని భైరవపట్నం (Bhairavapatnam) గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ గ్రామంలో పక్షులను వేటాడే వేటగాళ్లు దాదాపు 30 పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నారు.
అయితే, ఓ ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉందని మస్కిటో కాయిల్ (Mosquito Coil) వెలిగించగా ఆ నిప్పు రవ్వలు ఓ ఇంటిని చుట్టుముట్టాయి. మంటల ధాటికి అక్కడే ఉన్న గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ముగ్గురు చిన్నారులు, ఓ మహిళ ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా దాదాపు 20 ఇళ్లుకు పైగా కాలి బూడిదయ్యాయి. గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కైకలూరు (Kaikaluru) ప్రభుత్వాసుపత్రికి తరలించారు.






