Fire Accident: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2024-10-29 02:55:31  IST  )

అగ్ని ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయలైన ఘటన హైదరాబాద్‌ (Hyderabad)లోని పాతబస్తీ (Old City)లో సోమవారం ఆర్ధరాత్రి చోటుచేసుకుంది.

Fire Accident: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్ని ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయలైన ఘటన హైదరాబాద్‌ (Hyderabad)లోని పాతబస్తీ (Old City)లో సోమవారం ఆర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దీపావళి (Diwali) పండుగ సందర్భంగా ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో బాణసంచా (Crackers)ను నిల్వ ఉంచారు. అయితే, ప్రమాదవశాత్తు వాటికి నిప్పు అంటుకోవడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న మోహన్‌ లాల్ (55), ఉష (50) కాలిన గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రెయిన్ బజార్ పోలీసులు ఫైర్ సిబ్బంది సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇంట్లో అక్రమంగా బాణసంచా నిల్వ ఉంచినట్లుగా వారు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

Next Story