- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పై కెమెరాతో మహిళల అసభ్య వీడియోలు చిత్రీకరణ..పైలట్ అరెస్ట్!
బహిరంగ ప్రదేశాలలో మహిళల వీడియోలను అసభ్యకర రీతిలో రికార్డ్ చేస్తున్న ఓ పైలట్‌ను పోలీసులు పట్టుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: బహిరంగ ప్రదేశాలలో మహిళల వీడియోలను అసభ్యకర రీతిలో రికార్డ్ చేస్తున్న ఓ పైలట్‌ను పోలీసులు పట్టుకున్నారు. యూపీకి చెందిన మోహిత్ ప్రియదర్శి అనే వ్యక్తి ఇటీవల ఢిల్లీ కిషన్ ఘడ్‌లోని శనిబజార్‌లో మహిళల వీడియోలను స్పై కెమెరాతో చిత్రించగా ఓ మహిళ చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అక్కడకు చేరుకోగా గమనించిన మోహిత్ అక్కడ నుండి పరార్ అయ్యాడు.
సీసీటీవీ పుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో మోహిత్ పైలట్ గా ఉద్యోగం చేస్తున్నట్టు గుర్తించారు. అతడి వద్ద నుండి స్పై కెమెరా, మహిళల వీడియోల చిప్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పలు బహిరంగ ప్రదేశాలలో వీడియోలను చిత్రీకరించినట్టు గుర్తించామని చెప్పారు. కేసు నమోదు చేసి మరెవరికైనా వీడియోలను పంపించాడా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్టు వెల్లడించారు.






