చికెన్ కోసం గొడవ.. ముగ్గురిపై కత్తితో దాడి.. తర్వాత ఏమైందంటే?

by Ramesh Naini |

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరులో చికెన్ కొనుగోలు విషయంలో జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది.

చికెన్ కోసం గొడవ.. ముగ్గురిపై కత్తితో దాడి.. తర్వాత ఏమైందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరులో చికెన్ కొనుగోలు విషయంలో జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. తనకు ముందు చికెన్ ఇవ్వాలంటూ గొడవకు దిగిన నరేశ్ అనే యువకుడు చికెన్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో విజయ్, చిన్న, గాబ్రేలు అనే ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికంగా కలకలం

దాడిలో తీవ్రంగా గాయపడిన విజయ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరికీ స్థానికంగా చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు నరేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై స్థానికంగా కలకలం రేగింది.

Next Story