మ‌హిళా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

by Ratna Kumari |

కరీంనగర్ కు చెందిన కాసిన గొట్టు భారతి అనే మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మ‌హిళా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
X

దిశ, గంగాధ‌ర/ రామ‌డుగు : రామడుగు మండల పరిధిలోని వెదిర వైన్ షాపు సమీపంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ కు చెందిన కాసిన గొట్టు భారతి అనే మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రామడుగు ఎస్ఐ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో తీవ్రంగా గాయపడిన మహిళను వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న అనంతరం ఎస్ఐ రాజు స్పందన చూపుతూ స్ట్రెచర్‌పై ఉన్న మహిళను స్వయంగా ఆసుపత్రి లోపలికి తరలించడం గమనార్హం. ప్రస్తుతం గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. స్థానికులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story