- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంట చేనులో కోతులను తరుముతూ మహిళా రైతు మృతి
by Bhoopathi Nagaiah |
పంట చేనులో కోతులను తరిమే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

X
దిశ, కొడిమ్యాల (మల్యాల): పంట చేనులో కోతులను తరిమే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన సంత లక్ష్మి అనే మహిళ రైతు శుక్రవారం రోజున తన చేనులో కోతులను తరిమే క్రమంలో ప్రమాద వశాత్తూ వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించి రక్షించే లోపు మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతురాలికి కూతురు, కొడుకు ఉన్నారు. కుమారుడు ఇటీవలే యూఎస్ఎ నుండి వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






