- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nirmal : తాగిన మైకంలో పసిబిడ్డ ప్రాణం తీసిన తండ్రి
by Muthe.Rajitha |
తాగిన మైకంలో తండ్రి చేసిన పనికి 28 రోజుల పసిగుడ్డు ప్రాణాలు వదిలింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తాగిన మైకంలో తండ్రి చేసిన పనికి 28 రోజుల పసిగుడ్డు ప్రాణాలు వదిలింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని నిర్మల్(Nirmal) జిల్లా ఖానాపూర్(Khanapur) లో చోటు చేసుకుంది. ఖానాపూర్ లో నివాసం ఉంటున్న శేఖర్, సుజాత దంపతులకు ఇటీవలే పాప జన్మించింది. అయితే మద్యానికి బానిస అయిన శేఖర్.. తాగిన మైకంలో ఇంటికి వచ్చి నిద్రిస్తున్న 28 రోజుల పసిపాపపై పడుకున్నాడు. దీంతో ఊపిరాడక ఆ పసిగుడ్డు ప్రాణాలు విడిచింది. తల్లి హాహాకారాలు చేయడంతో ఇంట్లో వారు వచ్చి తండ్రిని బిడ్డపై నుంచి లేపి చూడగా.. అప్పటికే పాప విగతజీవిగా మారింది. సమాచారం అందుకున్న ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని, శేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు.
Next Story






