- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి రూపంలో రాక్షసుడు.. ఇద్దరు పిల్లల హత్యకు కుట్ర
కన్న తండ్రే ఇద్దరు పిల్లను హత్య చేయాలని ప్రయత్నించి తనలోని రాక్షసుడిని బయటకు తీశాడు. ఈ దారుణమైన సంఘటన కరీంనగర్ జిల్లా వావిలాల పల్లి లో చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: కన్న తండ్రే ఇద్దరు పిల్లను హత్య చేయాలని ప్రయత్నించి తనలోని రాక్షసుడిని బయటకు తీశాడు. ఈ దారుణమైన సంఘటన కరీంనగర్ జిల్లా వావిలాల పల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మల్లేశం అనే వ్యక్తికి భార్యతో పాటు ఆశ్రిత్, అర్చన అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు. అయితే ఏమైందో ఏమో గాని తండ్రి మల్లేశం వారిని హతమార్చాలని ప్లాన్ వేసుకున్నాడు. తన పిల్లలను గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించగా భార్య వచ్చి చూసింది. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే ఆమె తన పిల్లలను హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది.
అయితే అప్పటికే కూతురు అర్చన ప్రాణాలు కోల్పోయింది. కుమారుడు ఆశ్రిత్ పరిస్థితి ఇంకా అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న మల్లేశం కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి సహాయం అవసరమని చెబుతున్నారు. పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడటానికి కారణమైన మానసిక ఒత్తిడిని అర్థం చేసుకుని, ఇలాంటి కుటుంబాలకు ముందుగానే సహాయం అందించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.






