- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లుడు-కూతురు మధ్య విభేదాలు.. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య
by Bhanu |
నిరాశతో జీవితం ముగించుకున్న ఓ తండ్రి విషాదం కలిగించిన సంఘటన కుబీర్ మండల కేంద్రంలో జరిగింది.

X
దిశ, కుబీర్: నిరాశతో జీవితం ముగించుకున్న ఓ తండ్రి విషాదం కలిగించిన సంఘటన కుబీర్ మండల కేంద్రంలో జరిగింది. స్థానికంగా నివాసమున్న నీలకంఠం గోవింద్ (64) శనివారం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఎస్సై ఏ. కృష్ణారెడ్డి మీడియాకు వెల్లడించారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, గోవింద్‌కు ఒకే ఒక్క కూతురు ఉంది. అల్లుడు, కూతురు మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో గోవింద్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ మనస్తాపంతో అతడు ఇంట్లోని దూలానికి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుని కూతురు నర్మద ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Next Story






