తండ్రే కాలయముడు.. బిడ్డను చంపి కాలువలో పడేసి..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దొంగతనం చేసిందనే అనుమానంతో బిడ్డను చంపి కాలువలో పడేశాడు తండ్రి. వివరాల్లోకి వెళ్తే.. బిచౌలా గ్రామానికి చెందిన అజయ్ శర్మకు పదమూడేళ్ల కూతురు ఉంది

తండ్రే కాలయముడు.. బిడ్డను చంపి కాలువలో పడేసి..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దొంగతనం చేసిందనే అనుమానంతో బిడ్డను చంపి కాలువలో పడేశాడు తండ్రి. వివరాల్లోకి వెళ్తే.. బిచౌలా గ్రామానికి చెందిన అజయ్ శర్మకు పదమూడేళ్ల కూతురు ఉంది. అయితే ఆమె ఇంట్లో ఉన్న గుడిలో డబ్బు కొట్టేసేదని.. ఇప్పుడు తన జేబులో నుంచి ఐదు వందలు కొట్టేసిందని కోపంతో ఊగిపోయాడు. ఈ విషయంపైనే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ టైమ్‌లోనే ఈ రోజు నా చేతుల్లో చచ్చిపోద్ది అని వార్నింగ్ ఇచ్చాడు. అదే కోపంతో స్కూల్ నుంచి పాపను తీసుకొచ్చేందుకు వెళ్లాడు. కానీ ఇంటికి బదులుగా పొలంలోకి తీసుకెళ్లి.. స్కార్ఫ్‌తో గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని కాలువలో పడేశాడు. శవం కనిపించడంతో స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడు అజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు.

Next Story