- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో దారుణం.. కొడుకును చంపి పాతిపెట్టిన తండ్రి
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకునే ఓ తండ్రి హత్య చేసి పాతిపెట్టాడు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ ఘటన గుంటూరు జిల్లాలోని ఎర్రబాలెంలో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకునే ఓ తండ్రి హత్య చేసి పాతిపెట్టాడు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ ఘటన గుంటూరు జిల్లాలోని ఎర్రబాలెంలో జరిగింది. తన కొడుకు కనిపించడంలేదని తల్లి ప్రమీలాబాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలుపెట్టారు. కాగా విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కొడుకును అతడి తండ్రే హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్ లో విచారించారు.
కొడుకు జల్సాలకు అలవాటు పడ్డాడని, తనకు తెలియకుండా గొర్రె పిల్లలను అమ్ముతున్నాడని అందుకే చంపేశానని తండ్రి పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ ఘటనకు సంబంధించి మీడియాతో మాట్లాడిన మృతుడి తల్లి తనకు ఏం తెలియదని, కొన్ని రోజులుగా తన కొడుకు కనిపించలేదని చెప్పింది. అసలు ఏం జరిగిందో పోలీసులు చెప్పేవరకు తనకు తెలియదని ఆవేదన వ్యక్తం చేసింది. తన ప్రాణంలాంటి కొడుకుని చంపేశాడని కన్నీళ్లు పెట్టుకుంది. కొడుకును చూసే అదృష్టం కూడా దక్కలేదని బోరున విలపించింది.






